Bolisetti Satyanarayana: జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ భార్య కన్నుమూత

anasena Leader Bolisetti Satyanarayanas Wife passes away
  • తెల్లవారుజామున కన్నుమూసిన నాగమణి
  • తన జీవితంలో ఇది అత్యంత దుఃఖభరితమైన రోజన్న బొలిశెట్టి
  • బొలిశెట్టి కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్న ప్రముఖులు
జనసేన పార్టీ కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ భార్య నాగమణి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బొలిశెట్టి సత్యనారాయణ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

భార్య మరణంపై ఆయన ఎక్స్ వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. "నా జీవితంలో ఇది అత్యంత దుఃఖభరితమైన సమయం. 1983, మే 4న నా జీవితంలోకి అడుగుపెట్టిన నా ప్రియమైన భార్య నాగమణి, నా ప్రతి సంతోషంలో, సంక్షోభంలో నాతో నిలిచింది. ఈరోజు ఉదయం 3 గంటలకు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది" అని ఆయన పేర్కొన్నారు.

"నా ప్రతి సాధన వెనుక ఉన్న మౌనమైన బలం ఆమె. ఆమెతో పాటు నా హృదయంలోని ఒక భాగం కూడా వెళ్లిపోయింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.. ఓం శాంతి" అంటూ బొలిశెట్టి తన ఆవేదనను పంచుకున్నారు. ఈ విషయం తెలియగానే జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాగమణి మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. బొలిశెట్టి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
Bolisetti Satyanarayana
Janasena
Nagaman
Bolisetti Satyanarayana wife
Janasena Party
Andhra Pradesh politics
political news
death
condolences
social media post

More Telugu News