Anant Singh: జైలు నుంచి గెలిచిన జేడీయూ నేత.. బీహార్ ఎన్నికల ఫలితాల్లో సంచలనం

JDU leader Anant Singh Wins Election While in Jail Bihar Polls
  • హత్య కేసులో జైలుకు వెళ్లిన అనంత్ సింగ్
  • జన్ సురాజ్ పార్టీ నేత హత్య కేసులో ఆరోపణలు
  • పోలింగ్ కు కొన్ని రోజుల ముందే పోలీసుల కస్టడీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నేత అనంత్ సింగ్ జైలు నుంచే విజయం సాధించారు. మొకామా నియోజకవర్గంలో ఆయన సంచలన విజయం నమోదు చేశారు. హత్య కేసులో ఆయన జైలు పాలైనప్పటికీ మొకామా ఓటర్లు ఆయనకే ఓటేసి గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) అభ్యర్థి దులార్ చంద్ యాదవ్ హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో అనంత్ సింగ్ పాత్ర ఉందని, ఆయన అనుచరులే దులార్ చంద్ ను చంపేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రాథమిక ఆధారలు సేకరించిన పోలీసులు అనంత్ సింగ్ ను పోలింగ్ కు కొన్ని రోజుల ముందే అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే అనంత్ సింగ్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మొకామా నుంచి నామినేషన్ దాఖలు చేసి ప్రచారం కూడా చేపట్టారు. ఈ హత్య కేసులో అనంత్ సింగ్ ను అదుపులోకి తీసుకోవడంతో ఆయన గెలుపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే, ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ అనంత్ సింగ్ కటకటాల వెనక ఉన్నప్పటికీ మొకామా నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
Anant Singh
Bihar Elections
JDU
Mokama
Bihar Assembly Elections
Jan Suraaj Party
Dulal Chand Yadav Murder Case
Bihar Politics
MLA Election Result

More Telugu News