Mahesh Babu: గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్... పాస్ లు ఉన్నవాళ్లే రావాలన్న మహేశ్ బాబు

Mahesh Babu Globe Trotter Event Only for Pass Holders
  • నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో తొలి ఈవెంట్
  • అభిమానుల కోసం ప్రత్యేక వీడియో విడుదల చేసిన మహేశ్
  • పాస్‌లు ఉన్నవారికే ఈవెంట్‌కు అనుమతి అన్న మహేశ్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తొలి ఈవెంట్ శనివారం (నవంబర్ 15) రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు తన అభిమానులను ఉద్దేశించి ఓ ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
 
ఈవెంట్‌కు హాజరయ్యే అభిమానులు తప్పనిసరిగా పాస్‌లు కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారని, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిబంధన పాటించాలని కోరారు. పాస్‌లు లేకుండా ఎవరూ రావొద్దని, పోలీసులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
 
వీడియోలో మహేశ్ బాబు సరదాగా మాట్లాడుతూ, "పాస్‌పోర్ట్ (ఈవెంట్ పాస్) లేకుండా కంగారు పడి వచ్చేయకండి" అంటూ అభిమానులకు సూచించారు. భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మహేశ్ బాబు, రాజమౌళి కలయికలో వస్తున్న తొలి చిత్రం కావడంతో దీనిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
Mahesh Babu
SS Rajamouli
Globe Trotter Event
Ramoji Film City
Mahesh Babu Movie
Rajamouli Film
Telugu Cinema
Movie Event
Film Promotion
Tollywood

More Telugu News