Devyani Rana: జమ్మూకశ్మీర్ లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేవయాని ఘన విజయం

Devyani Rana BJP wins Nagrota byelection with huge majority in Jammu Kashmir
  • జమ్మూకశ్మీర్ నాగ్రోటా ఉప ఎన్నికలో బీజేపీ విజయం
  • ఘన విజయం సాధించిన అభ్యర్థి దేవయాని రాణా
  • డిపాజిట్ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థి
  • ఇది రాణా కుటుంబానికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదమన్న దేవయాని
  • నాగ్రోటా తీర్పు బిహార్ ఫలితాల లాంటిదేనని వ్యాఖ్య
జమ్మూకశ్మీర్‌లోని నాగ్రోటా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా ఘన విజయం సాధించారు. అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో అధికార పార్టీ అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని పలు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలో నాగ్రోటా తీర్పు వెల్లడైంది. ఈ నియోజకవర్గంలో రాణా కుటుంబానికి ఉన్న పట్టు మరోసారి నిరూపితమైంది. 

ఈ విజయంపై దేవయాని రాణా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. "నాగ్రోటా ప్రజలు నన్ను ఒక కుటుంబ సభ్యురాలిగా భావించి ఆశీర్వదించారు. మా తండ్రి రాణా సాహిబ్‌పై చూపిన ప్రేమాభిమానాలనే నాపై కూడా చూపించారు" అని ఆమె అన్నారు. నాగ్రోటాలో వచ్చిన తీర్పే బీహార్‌లో కూడా కనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.


Devyani Rana
Nagrota byelection
Jammu Kashmir election
BJP victory
Rana family
Nagrota constituency
Indian politics
Bihar elections
Political analysis
BJP candidate

More Telugu News