Naveen Yadav: నవీన్ యాదవ్ గెలుపును అధికారికంగా ప్రకటించిన ఈసీ... పార్టీలవారీగా ఓట్లు, నోటాకు పడ్డ ఓట్లు ఇవే!

Party wise votes in Jubilee Hills By Election
  • జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం
  • 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు
  • నోటాకు ఓటు వేసిన 924 మంది ఓటర్లు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ఆధిక్యాన్ని నిరూపించుకుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు రాగా... బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇండిపెంటెంట్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో బేర బాలకిషన్ కు అత్యధికంగా 175 ఓట్లు వచ్చాయి. నోటాకు 924 మంది ఓటు వేశారు.
Naveen Yadav
Jubilee Hills by election
Telangana Congress
Maganti Sunitha
BRS
Deepak Reddy
BJP
NOTA
Telangana Politics
Congress victory

More Telugu News