బీహార్ లో మళ్లీ ఎన్డీయే... ఇది 'న-ని' పనితీరుకు నిదర్శనమన్న నారా లోకేశ్

Nara Lokesh Comments on NDA Victory in Bihar Elections
  • బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా ఎన్డీయే కూటమి 
  • ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్
  • ఇది 'నరేంద్ర మోదీ-నితీశ్ కుమార్ర' మ్యాజిక్ అంటూ ప్రశంస
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతుండడం పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ విజయంపై నారా లోకేశ్ స్పందిస్తూ, "బీహార్‌లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయానికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జీకి అభినందనలు. ఇది 'న- ని' (నరేంద్ర మోదీ-నితీశ్ కుమార్) మ్యాజిక్ పనితీరు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం, నితీశ్ కుమార్ విశ్వసనీయ పాలనపై ప్రజలు ఉంచిన బలమైన నమ్మకానికి ఈ తీర్పు నిదర్శనం" అని పేర్కొన్నారు.

ఈ ఘన విజయాన్ని అందుకున్నందుకు బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీల నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రజల నమ్మకానికి, ప్రగతి పట్ల వారి ఆకాంక్షలకు ఈ తీర్పు అద్దం పడుతుందని అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Nara Lokesh
Bihar Election Results
NDA Victory
Nitish Kumar
Narendra Modi
BJP
JDU
Lok Janshakti Party
Andhra Pradesh
AP Minister

More Telugu News