IND Vs SA: కోల్‌కతా టెస్టు: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. నలుగురు స్పిన్నర్లతో బరిలోకి భారత్

Shubman Gill Leads India With Four Spinners in Kolkata Test
  • టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ టెంబా బవుమా
  • భారత జట్టులో అనూహ్య మార్పులు.. నలుగురు స్పిన్నర్లకు చోటు
  • యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌ను పక్కనపెట్టిన టీమిండియా
  • గాయం కారణంగా స్టార్ పేసర్ రబడ దూరం
భారత్, దక్షిణాఫ్రికా మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో సఫారీ కెప్టెన్ టెంబా బవుమా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో ఏకంగా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌పై వేటు వేసి, అతని స్థానంలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లను జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటికే జట్టులో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఉండటంతో భారత బౌలింగ్ విభాగం స్పిన్ బలంగా కనిపిస్తోంది. పేస్ బాధ్యతలను జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ మోయనున్నారు.

మరోవైపు పర్యాటక దక్షిణాఫ్రికా జట్టుకు మ్యాచ్‌కు ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబడ పక్కటెముకల గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని గైర్హాజరీ సఫారీ బౌలింగ్‌పై కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్‌క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరైన్ (వికెట్ కీపర్), కార్బిన్ బాష్, సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్.
IND Vs SA
Shubman Gill
India vs South Africa
Kolkata Test
Eden Gardens
Kuldeep Yadav
Axar Patel
Ravindra Jadeja
Jasprit Bumrah
Temba Bavuma
Cricket

More Telugu News