Ruturaj Gaikwad: దక్షిణాఫ్రికా 'ఏ'పై భారత్ 'ఏ' విజయం.. అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్

India A Defeats South Africa A Ruturaj Gaikwad Shines
  • నిర్ణీత 50 ఓవర్లలో 285 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా
  • 49.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన భారత్
  • 117 పరుగులతో ఆకట్టుకున్న రుతురాజ్ గైక్వాడ్
రాజ్‌కోట్ వేదికగా దక్షిణాఫ్రికా 'ఏ' జట్టుతో జరిగిన మొదటి అనధికారిక వన్డే మ్యాచ్‌లో భారత 'ఏ' జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 285 పరుగులు చేయగా, భారత్ 49.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రుతురాజ్ గైక్వాడ్ 129 బంతుల్లో 117 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

కెప్టెన్ తిలక్ వర్మ (39), నితీశ్ కుమార్ రెడ్డి (37), అభిషేక్ శర్మ (31), నిశాంత్ సింధూ (29 నాటౌట్) తమవంతు సహకారం అందించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో వూరెన్, ఫోర్ట్విన్ బార్ట్‌మాన్ తలో రెండు వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డెలానో (90), డియాన్ ఫారెస్టర్ (77), ఫోర్టన్ (59) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్, హర్షిత్ చెంరో రెండు వికెట్లు పడగొట్టారు.
Ruturaj Gaikwad
India A
South Africa A
Rajkot
Unofficial ODI
Tilak Varma
Cricket

More Telugu News