Kachiguda Railway Track: ఢిల్లీ కారు పేలుడు ఘటన వేళ.. కాచిగూడ రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని కారు కలకలం!

Kachiguda Railway Track Unidentified Car Creates Stir After Delhi Blast
  • రైల్వే ట్రాక్‌పై కారును వదిలి పెట్టి వెళ్లిన దుండగులు
  • బాలాజీ అనే వ్యక్తి మీద కారు రిజిస్టర్ అయినట్లు గుర్తించిన పోలీసులు
  • కారును అద్దెకు ఇచ్చినట్లు తెలిపిన యజమాని
  • మద్యం మత్తులో కారును అక్కడ వదిలేసి వెళ్లినట్లు గుర్తింపు
హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని కారు కలకలం సృష్టించింది. ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో 13 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో కాచిగూడ రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని కారును గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ కారును ట్రాక్‌పై వదిలి వెళ్లారు. ఈ కారు బాలాజీ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. కారు యజమానిని ప్రశ్నించగా, దానిని అద్దెకు ఇచ్చినట్లు పోలీసులకు వెల్లడించారు.

దీంతో పోలీసులు రైల్వే ట్రాక్ వద్ద ఆంక్షలు విధించి, బాంబు స్క్వాడ్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. ఎవరికి అద్దెకు ఇచ్చారు, వారు ఈ కారును ట్రాక్‌పై ఎందుకు వదిలేశారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అద్దెకు తీసుకున్నవారు మద్యం మత్తులో కారును అక్కడ వదిలి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Kachiguda Railway Track
Hyderabad
Delhi Car Blast
Car on Railway Track
Bomb Squad

More Telugu News