GHMC Office: జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
- జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో మొదటి అంతస్తులో మంటలు
- రెవెన్యూ ఫైళ్లు మంటల్లో దగ్ధం
- బయటకు పరుగు పెట్టిన ఉద్యోగులు
హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో పలు రెవెన్యూ ఫైళ్లు అగ్నికి ఆహూతైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మొదటి అంతస్తులో మంటలు వ్యాపించడంతో ఉద్యోగులు భయాందోళనలతో కార్యాలయం నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.