Indigo Airlines: ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు.. మెయిల్ పంపిన దుండగులు

Indigo Airlines Receives Bomb Threat for Multiple Flights
  • ఢిల్లీ, కోల్‌కతా, తిరువనంతపురం నుంచి నడుస్తున్న విమానాశ్రయాల్లో బాంబు అమర్చినట్లు బెదిరింపులు
  • విమానాశ్రయ అధికారులను అలర్ట్ చేసిన అధికారులు
  • విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించిన అధికారులు
ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బుధవారం గురుగ్రామ్‌లోని ఇండిగో ప్రధాన కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిళ్లు పంపించారు. దేశ రాజధాని ఢిల్లీ, కోల్‌కతా, తిరువనంతపురం నుంచి నడుస్తున్న పలు విమానాల్లో బాంబు అమర్చినట్లు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన ఎయిర్‌లైన్స్ అధికారులు సంబంధిత విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు.

కోల్‌కతా నుంచి ముంబైకి వెళుతున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు రావడంతో, ఆ విమానంలోని 186 మంది ప్రయాణికులను కిందకు దించి, విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. ఢిల్లీ, తిరువనంతపురం విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. బాంబు స్క్వాడ్ బృందాలతో ఇండిగో విమానాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Indigo Airlines
Indigo bomb threat
bomb threat
Delhi airport
Kolkata airport

More Telugu News