ఓటీటీలో మలయాళం హారర్ థ్రిల్లర్ సిరీస్!

Inspection Bungalow Series Update
  • మలయాళం నుంచి మరో హారర్ సిరీస్  
  • ఈ నెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్
  • పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే కథ  
  • జీ 5లో తెలుగులోను అందుబాటులోకి    

ఒకప్పుడు హారర్ కంటెంట్ తో కూడిన సినిమాలు థియేటర్లకు వస్తే, జనాలు పెద్దగా చూసేవారు కాదు. ఎందుకంటే ఈ తరహా కథలను ఇష్టపడే ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే వచ్చేవారు.  కానీ అదే హారర్ కంటెంట్ కి ఇప్పుడు ఓటీటీ ట్రాక్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. అందువలన శుక్రవారం వచ్చేసరికి ఈ తరహా జోనర్ కి సంబంధించిన సినిమాలు .. సిరీస్ లు క్యూ కడుతున్నాయి. వీటిలో ముందుగా ఏవి చూడాలనే కుతూహలంతో ప్రేక్షకులు ఉంటున్నారు. 

ఈ నేపథ్యంలో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఒక మలయాళ హారర్ కామెడీ థ్రిల్లర్ సిద్ధమవుతోంది. ఆ సిరీస్ పేరే 'ఇన్స్పెక్షన్ బంగ్లా'. సైజు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లోశబరీశ్ వర్మ .. షాజు శ్రీధర్ .. జయన్ .. వీణా నాయర్ .. బాలాజీ శర్మ .. సెంథిల్ కృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించారు. 'జీ 5'లో ఈ నెల 14వ తేదీ నుంచి మళయాళంతో పాటు తమిళ .. తెలుగు భాషల్లో ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. 

కథలోకి వెళితే .. ఒక గ్రామంలోని పోలీస్ స్టేషన్ కి సబ్ ఇన్ స్పెక్టర్ విష్ణుకి బదిలీ అవుతుంది. ఆ గ్రామానికి వచ్చిన అతను, పోలీస్ స్టేషన్ ను ఒక పాడుబడిన బంగళాలోకి మార్చవలసి వస్తుంది. అది ప్రభుత్వానికి సంబంధించిన బంగ్లా. అలా పోలీస్ స్టేషన్ ను ఆ బంగ్లాలోకి మార్చే ప్రయత్నంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి?అందుకు కారణం ఏమిటి? పాడుబడిన ఆ బంగ్లా నేపథ్యం ఏమిటి? అనేది కథ.        
Go Back to Shorts
Inspection Bungalow
Malayalam horror series
OTT horror thriller
ZEE5
Shabarish Varma
Shaju Sreedhar
horror comedy series
Telugu dubbed series

More Telugu News