Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ కూటమికే ఆ సామాజిక వర్గాల ఓట్లు!

Bihar Elections NDA Alliance Receives Votes from These Communities
  • బీజేపీ వైపు మొగ్గు చూపిన ఓబీసీ, ఎస్సీ ఓటర్లు
  • కాంగ్రెస్‌కు ఓటేసిన 78 శాతం మంది ముస్లింలు
  • ప్రభావం చూపని ప్రశాంత్ కిశోర్ పార్టీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాల సరళిని పరిశీలిస్తే ఎన్డీయేకు 145 నుంచి 150 సీట్లు, మహాఘట్‌బంధన్‌కు 90 సీట్ల వరకు రావొచ్చని అంచనా. అన్ని సర్వేలు కూడా బీజేపీ కూటమి వైపే మొగ్గు చూపాయి. ఈ నేపథ్యంలో బీహార్‌లో ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఎవరి వైపు మొగ్గు చూపిందనే విషయాలను కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు వెల్లడించాయి.

మంగళవారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్ డేటా ప్రకారం, బీహార్‌లో ఓబీసీలు, ఎస్సీ సామాజిక వర్గాలు బీజేపీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు అనుకూలంగా ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. ఓబీసీ ఓటర్లలో 51 శాతం మంది, ఎస్సీ ఓటర్లలో 49 శాతం మంది బీజేపీ, జేడీయూ కూటమికి అనుకూలంగా ఓట్లు వేశారని మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ డేటా వెల్లడించింది.

అదే సమయంలో ముస్లిం వర్గం ఓట్లు 78 శాతం వరకు ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌కు పడి ఉంటాయని తెలిపింది.

ఎన్డీయే వైపు జనరల్‌లో మొగ్గు చూపిన వారు 69 శాతం, ఓబీసీలు 51 శాతం, ఎస్సీలు 49 శాతం, ముస్లింలు 10 శాతం ఉన్నారని ఈ ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది.

మహాఘట్‌బంధన్ వైపు జనరల్‌లో మొగ్గు చూపిన వారు 15 శాతం, ఓబీసీలు 39 శాతం, ఎస్సీలు 38 శాతం, ముస్లింలు 78 శాతం ఉన్నారని ఈ ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది.

ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీకి జనరల్‌లో మొగ్గు చూపిన వారు 7 శాతం, ఓబీసీలు 4 శాతం, ఎస్సీలు 5 శాతం, ముస్లింలు 4 శాతం ఉన్నారని ఈ ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది.
Bihar Elections
Bihar Assembly Elections
NDA Alliance
BJP JDU
OBC Voters
SC Voters

More Telugu News