Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud Reacts to Jubilee Hills ByElection Exit Polls
  • జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలవబోతుందన్న టీపీసీసీ చీఫ్
  • ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయం చెప్పాయన్న మహేశ్ కుమార్ గౌడ్
  • ప్రజలంతా నవీన్ వైపు నిలిచారని వ్యాఖ్య
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్, ఎగ్జిట్ పోల్ ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతోందని ఆయన జోస్యం చెప్పారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా నవీన్ యాదవ్ వైపు నిలిచారని ఆయన పేర్కొన్నారు.

ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమను ముందుండి నడిపించారని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నవీన్ యాదవ్ తప్పకుండా గెలుస్తారని, ఆయన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ టీపీసీసీ చీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో తాము సఫలీకృతం చెందామని ఆయన అన్నారు.
Mahesh Kumar Goud
Jubilee Hills by election
Telangana Congress
Revanth Reddy
Naveen Yadav

More Telugu News