Ajith Kumar: సినీ నటుడు అజిత్ ఇంటికి, కాంగ్రెస్ కార్యాలయానికి బాంబు బెదిరింపు

Ajith Kumars House Receives Bomb Threat in Chennai
  • చెన్నైలో కొన్ని రోజులుగా నాయకులు, సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలకు బాంబు బెదిరింపులు
  • సినీ నటుడు అజిత్ కుమార్ ఇల్లు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్‌కు బాంబు బెదిరింపులు
  • తనిఖీల్లో ఎలాంటి బాంబు లేదని గుర్తించిన బాంబు స్క్వాడ్
ప్రముఖ సినీ నటుడు అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. గత కొన్ని రోజులుగా చెన్నైలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల ఇళ్లకు, కార్యాలయాలకు బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నైలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్, ఈసీఆర్‌లో ఉన్న నటుడు అజిత్ కుమార్ నివాసం, ఈవీసీ ఫిలిమ్ సిటీ తదితర ప్రాంతాల్లో బాంబులు ఉన్నట్లు ఈరోజు డీజీపీ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు అందాయి.

సమాచారం అందిన వెంటనే బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి ఆయా ప్రాంతాలలో తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో ఎటువంటి బాంబులు లేవని నిర్ధారించారు. ఇదివరకే ఎస్వీ శేఖర్, నటి రమ్యకృష్ణ ఇళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం విదితమే. సోమవారం నాడు నటి త్రిష నివాసం, ఈడీ డైరెక్టరేట్ కార్యాలయానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులకు పాల్పడుతున్నది ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Ajith Kumar
Ajith
Tamil Nadu
Bomb Threat
Chennai
Congress Office

More Telugu News