ఓటీటీకి 100 కోట్ల సినిమా .. 'డ్యూడ్'
- ప్రదీప్ రంగనాథన్ హీరోగా 'డ్యూడ్'
- 100 కోట్లు రాబట్టిన సినిమా
- ఈ నెల 14 నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో
- ఐదు భాషల్లో అందుబాటులోకి
కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, కొత్త కోణంలో ఆవిష్కరించారు. కథలోని కొత్త పాయింట్ యూత్ కి ఎక్కేసింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్'వారు దక్కించుకున్నారు. ఈ సినిమాను ఈ నెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తూ పోస్టర్ ను కూడా వదిలారు.
హీరో తన మేనమామ కూతురును ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆమె మనసులో మరొకరు ఉన్నారని తెలుసుకుంటాడు. వేరే కులానికి చెందిన వ్యక్తితో పెళ్లికి తన మేనమామ ఒప్పుకోడనే విషయం అతనికి తెలుసు. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఫలితంగా ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయి? అనేది కథ. ఐదు భాషల్లో ఓటీటీకి వస్తున్న ఈ సినిమాకి, ఈ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.