Half male half female spider: ఈ సాలీడు అర్దనారీశ్వరుడు.. సగం మగ, సగం ఆడ లక్షణాలు
- థాయ్ లాండ్ లో కొత్తరకం సాలీడు గుర్తించిన శాస్త్రవేత్తలు
- సాలీడు శరీరంపై స్పష్టంగా కనిపిస్తున్న రెండు రంగులు
- ఒకవైపు ఆడ లక్షణాలు, రెండో వైపు మగ లక్షణాలు ఉన్నట్లు వెల్లడి
ప్రపంచంలోని జీవరాశుల్లో అయితే మగ లేదంటే ఆడ లక్షణాలు ఉంటాయి. రెండూ ఒకే జీవిలో ఉండడం అత్యంత అరుదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, తాజాగా ఓ సాలీడులో ఆడ, మగ లక్షణాలు కనిపించడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు, ఈ లక్షణాలకు సంబంధించి ఆ సాలీడు శరీరంపై స్పష్టమైన సంకేతాలు కూడా ఉండడం విశేషం. సాలీడు శరీరం కచ్చితమైన రెండు భాగాలుగా విభజింపబడి ఒకవైపు నారింజ రంగు, మరోవైపు బూడిద రంగులో ఉంది. ఈ అరుదైన సాలీడును థాయ్‌లాండ్‌లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ సాలీడును డెమార్చస్ ఇనాజుమాగా వారు గుర్తించారు. థాయ్‌లాండ్‌లోని నాంగ్ రోంగ్ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వేటగాళ్ల కోసం తవ్వుతున్నప్పుడు ఈ సాలీడును గుర్తించినట్లు తెలిపారు.
ఇలా ఒకే జీవిలో మగ మరియు ఆడ కణజాలాలు, లక్షణాలు ఉండడాన్ని సాంకేతిక పరిభాషలో ‘గైనండ్రోమోర్ఫిజం’ అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కొత్తరకం సాలీడుకు సంబంధించిన అధ్యయనాన్ని "జూటాక్సా" అనే పత్రిక ప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. సాలీడు శరీరం సమరూపంగా విభజించబడిందని తెలిపింది. ఎడమ వైపు ఆడ లక్షణాలు, కుడి వైపు మగ లక్షణాలు ఉన్నాయని వెల్లడించింది. ఆడ లక్షణాలలో పెద్ద కోరలతో పాటు శరీర భాగం నారింజ రంగులో ఉందని పేర్కొంది. మగ లక్షణాలలో చిన్న పరిమాణం, శరీర భాగం బూడిద తెలుపు వర్ణంలో ఉందని వివరించింది.