Tamannaah Bhatia: శరీరాకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు.. తమన్నా భాటియా

Tamannaah Bhatia denies weight loss injection rumors
  • బరువు తగ్గేందుకు తమన్నా ఇంజెక్షన్లు వాడుతున్నారని ప్రచారం
  • ఓ ఇంటర్వ్యూలో స్పందించిన నటి
  • 15 ఏళ్ల వయసు నుంచే నటిస్తున్నానని వెల్లడి
మహిళల శరీరాకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదని, ఐదేళ్లకు ఓసారి మార్పులు జరుగుతుంటాయని ప్రముఖ నటి తమన్నా భాటియా పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ఒకే శరీరాకృతితో కనిపించలేమని ఆమె వివరించారు. బరువు తగ్గేందుకు ఇంజెక్షన్లు వాడుతున్నారంటూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

 పదిహేనేళ్ల వయసు నుంచే తాను నటిస్తున్నానని తెలిపారు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉన్నానని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, సినిమాల్లోని పాత్రల కోసం ఒక్కోసారి బరువు పెరగడం, మరోసారి తగ్గడం చేయాల్సి వస్తుందని తమన్నా వివరించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చానని, కెమెరాతో తన ప్రయాణం సాగుతోందని చెప్పారు. ఇందులో దాచిపెట్టడానికి ఏమీలేదన్నారు.

చిరంజీవి సినిమాలో ఐటెం సాంగ్..!
ఇటీవల కాలంలో తమన్నా స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ఆమె నటించిన 'కావాలయ్య', 'డా డా డాస్' వంటి పాటలు షేక్ చేశాయి. ఇప్పుడు అదే జోరుతో చిరంజీవి సినిమాలో కూడా మాస్ ఆడియన్స్‌కు అదిరిపోయే కిక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. చిరంజీవి లేటెస్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'లో స్పెషల్ సాంగ్ ఉండనుందని, అందులో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మెగాస్టార్‌తో కలిసి స్టెప్పులేయనున్నారని సమాచారం.
Tamannaah Bhatia
Tamanna Bhatia
actress
body image
weight loss
Chiranjeevi
item song
Manashankara Varaprasad Garu
special songs
Tollywood

More Telugu News