కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్.. ఆ సెక్షన్లు కేసుకు సరిపోలడం లేదన్న హైకోర్టు
- తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో కేటీఆర్ పిటిషన్
- రాజకీయ కక్షల కారణంగానే కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపిన కేటీఆర్
- ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకే కేసు నమోదు చేసినట్లు తెలిపిన పోలీసులు
రాజకీయ కక్షల కారణంగానే ఈ కేసు నమోదు చేశారని కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకే కేసు నమోదు చేసినట్లు పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అమరవీరుల స్మారకం వద్ద గోరటి వెంకన్నను కేటీఆర్ ఇంటర్వ్యూ చేశారని, అందులో బీఆర్ఎస్‌కు లబ్ధి చేకూరేలా అంశాలు ఉన్నాయని వాదనలు వినిపించారు. అంతేకాకుండా, అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని తెలిపారు.
ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు, ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసిన సెక్షన్లు ప్రస్తుత కేసుకు సరిపోవడం లేదని వ్యాఖ్యానిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.