Khushboo Ahirwar: సహజీవనం చేస్తున్న మోడల్ అనుమానాస్పద మృతి

Khushboo Ahirwar Model Dies Suspiciously in Bhopal
  • భోపాల్‌లో ఖాసీమ్ అహ్మద్ అనే వ్యక్తితో సహజీవనం
  • మోడల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు
  • ఖాసీమ్ అహ్మద్ అనే వ్యక్తి హత్య చేసినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఒక మోడల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఖాసీమ్ అహ్మద్ అనే వ్యక్తి ఆమెను హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మోడల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

27 ఏళ్ల ఖుష్బూ అహిర్వార్ అలియాస్ ఖుషి కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. పూర్తిగా మోడలింగ్‌కే పరిమితం కావాలనే ఉద్దేశంతో కొన్ని పార్ట్‌టైమ్ ఉద్యోగాలను కూడా మానివేసింది. 'డైమండ్ గర్ల్' పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు విశేషమైన గుర్తింపు ఉంది. ఖుష్బూ గత మూడేళ్లుగా భోపాల్‌లో నివసిస్తోంది. నగరంలో ఆమె ఖాసీమ్ అహ్మద్ అనే యువకుడితో సహజీవనం చేసింది.

సోమవారం ఉదయం ఖుష్బూ ఆరోగ్యం క్షీణించడంతో ఖాసీమ్ ఆమెను ఆసుపత్రికి తరలించాడు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. ఖుష్బూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించిన వెంటనే ఖాసీమ్ అక్కడి నుంచి పరారయ్యాడు.

ఖుష్బూ తల్లి మాట్లాడుతూ, ఖాసీమ్ అర్ధరాత్రి తమకు ఫోన్ చేసి ఖుష్బూ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించిందని, తాను ఆసుపత్రికి తీసుకు వెళ్లానని చెప్పాడని తెలిపారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారని కూడా ఖాసీమ్ తమతో చెప్పాడని ఆమె అన్నారు. అయితే తన కుమార్తె ముఖం, శరీరంపై గాయాల గుర్తులు కనిపించాయని, ఆమెను తీవ్రంగా కొట్టడం వల్లే మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Khushboo Ahirwar
Bhopal model death
model murder case
Kasim Ahmed
live in relationship death
Diamond Girl Instagram
Madhya Pradesh crime
suspicious death
model suspicious death
crime news

More Telugu News