Nara Lokesh: ఇది కల్తీ కాదు... హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వక దాడి: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh says Tirumala laddu issue is attack on Hindu faith
  • తిరుమల లడ్డూ వివాదంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు
  • ఇది కల్తీ కాదని, హిందువుల విశ్వాసాలపై జరిగిన ఉద్దేశపూర్వక దాడి అని స్పష్టీకరణ
  • సుప్రీంకోర్టు నియమించిన సిట్ నిజాలను వెలికితీసిందని వెల్లడి
  • చట్టప్రకారం దోషులకు కఠిన శిక్ష తప్పదని హెచ్చరిక
  • పవిత్రమైన విషయాలతో ఆడుకున్న వారు భారీ మూల్యం చెల్లించాలన్న లోకేశ్
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం కల్తీ వ్యవహారం కాదని, హిందువుల విశ్వాసాలపై జరిగిన ఉద్దేశపూర్వక దాడి అని ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ వ్యవహారంలో నిజాలను బయటపెట్టిందని లోకేశ్ తెలిపారు. "ఇది కల్తీ కాదు.. హిందువుల విశ్వాసంపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి. మన నమ్మకాన్ని అపవిత్రం చేసే ప్రయత్నం. ఇది భరతమాత ఆత్మపై జరిగిన నేరం" అని ఆయన అభివర్ణించారు. దోషులు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.

పవిత్రమైన విషయాలతో చెలగాటమాడిన వారు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని లోకేశ్ స్పష్టం చేశారు. "ఎవరైతే పవిత్రతతో ఆడుకున్నారో వారు తగిన మూల్యం చెల్లించాలి... ఓం నమో వెంకటేశాయ" అని పేర్కొన్నారు. 
Nara Lokesh
Tirumala laddu
Tirupati laddu
Adulterated ghee
TTD
Hindu beliefs
AP Government
Special Investigation Team
SIT investigation
Corruption

More Telugu News