Siddaramaiah: ముఖ్యమంత్రి మార్పు.. సిద్ధరామయ్యకు అపాయింట్‌మెంట్ ఇవ్వని కాంగ్రెస్ అధిష్ఠానం!

Siddaramaiah Denied Meeting by Congress High Command on CM Change
  • కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై జోరుగా ప్రచారం
  • కాంగ్రెస్ పెద్దలతో సమావేశమయ్యేందుకు సమయం కోరిన సిద్ధరామయ్య
  • ఆ సమావేశం అవసరం లేదన్న కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం
ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని సమాచారం. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే ప్రచారం కొంతకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కె. శివకుమార్ బెంగళూరు, ఢిల్లీల మధ్య పర్యటిస్తున్నారు. నవంబర్ చివరి నాటికి రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటాయనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పెద్దలతో సమావేశమయ్యేందుకు ఆయన సమయం కోరగా, ఆ సమావేశం అవసరం లేదని కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు స్పష్టం చేసిందని తెలుస్తోంది.

కేంద్ర నాయకత్వం సమయం ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ, సిద్ధరామయ్య తన ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. మరో రెండున్నరేళ్లు తమ పార్టీయే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌కే ప్రజలు ఓటు వేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Siddaramaiah
Karnataka Chief Minister
Congress Party
DK Shivakumar
Karnataka Politics
Chief Minister Change

More Telugu News