Vasantha Krishna Prasad: చిన్న కమ్మవాళ్లు అంటే కాపులే: టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Vasantha Krishna Prasad Says Kapus Were Called Chinna Kammas
  • చిన్నప్పుడు చిన్న కమ్మవాళ్లు అంటే కాపులని చెప్పేవారన్న వసంత
  • పొలాలు తక్కువుంటే కాపులని, ఎక్కువుంటే కమ్మలని పిలిచేవారని వెల్లడి
  • రాజకీయాల వల్లే రెండు కులాల మధ్య దూరం పెరిగిందని ఆవేదన
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కమ్మ, కాపు సామాజిక వర్గాలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. తన చిన్నతనంలో చిన్న కమ్మవాళ్లు అంటే కాపులని, పెద్ద కమ్మోళ్లు అంటే అసలైన కమ్మవాళ్లని పిలిచేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. కేవలం భూమిని బట్టే ఈ తేడా ఉండేదని, అంతకుమించి రెండు కులాల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని స్పష్టం చేశారు.

వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, "ఒకప్పుడు పొలాలు తక్కువగా ఉన్న వారిని కాపులని, ఎక్కువగా ఉన్న వారిని కమ్మలని పిలిచేవారు. తరతరాలుగా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించాం. అయితే, మధ్యలో వచ్చిన కొన్ని రాజకీయాలు మన మధ్య దూరం పెంచాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ బేధాలను పక్కనపెట్టి మన బిడ్డల భవిష్యత్తు కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. "కమ్మ లేదు, కాపు లేదు. మనమంతా సమైక్యంగా ఎదిగి జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలి" అని ఆయన అన్నారు.
Vasantha Krishna Prasad
TDP
Telugu Desam Party
Kamma
Kapu
Andhra Pradesh Politics
Caste Politics
Community Harmony
Political Speech

More Telugu News