Gautam Gambhir: టీ20 ప్రపంచ కప్.. ఆటగాళ్లకు గౌతమ్ గంభీర్ కీలక సూచన

Gautam Gambhirs Key Advice to Players for T20 World Cup
  • మరో మూడు నెలల సమయం మాత్రమే ఉందన్న గౌతమ్ గంభీర్
  • ప్రపంచ కప్ కోసం పూర్తిగా సన్నద్ధమవ్వాలని సూచన
  • భారత్, శ్రీలంకలలో టీ20 ప్రపంచ కప్
టీ20 ప్రపంచ కప్ కోసం ఆటగాళ్లంతా పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని, ఫిట్‌నెస్ పరంగా కూడా సిద్ధంగా ఉండాలని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కీలక సూచన చేశాడు. ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచ కప్ 2026కు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉందని అన్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడిన మాటలను బీసీసీఐ సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా పంచుకుంది.

టీమిండియా డ్రెస్సింగ్ రూం పారదర్శకంగా ఉంటుందని, దానిని కొనసాగించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నాడు. టీ20 ప్రపంచ కప్ కోసం పూర్తిగా సన్నద్ధం కావాల్సి ఉందని సూచన చేశాడు. మరో మూడు నెలల సమయం మాత్రమే ఉందని, ఇలాంటి సమయంలో ఆటగాళ్లంతా ఫిట్‌నెస్ ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచ కప్ 2026 భారత్, శ్రీలంకలో జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8 వరకు మ్యాచ్‌లు జరగనుండగా, భారత్‌‍లోని ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా వేదికలు కానున్నాయి. పాకిస్థాన్ ఆడే మ్యాచ్‌లకు శ్రీలంకలోని కొలంబో, క్యాండీ వేదికలు కానున్నాయి. పాకిస్థాన్ ఫైనల్ చేరుకుంటే తుది పోరు కొలంబోలో, నిష్క్రమిస్తే అహ్మదాబాద్‌లో జరగనుంది.
Gautam Gambhir
T20 World Cup
Team India
BCCI
Fitness
India
Sri Lanka
Cricket

More Telugu News