రేవంత్ రెడ్డి ఒత్తిడిలో ఉన్నారు.. ఓటమి భయం కనిపిస్తోంది: బీజేపీ ఎంపీ
- కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీపై నిందలు వేస్తారా అని ఆగ్రహం
- మీ స్నేహితుడు ఇంటికో ఉద్యోగమని ఇచ్చిన హామీ సాధ్యమైనా అని ప్రశ్న
- పుట్టిన రోజు సందర్భంగా ప్రజలకు ఇచ్చే బహుమతి ఏమిటో చెప్పాలన్న లక్ష్మణ్
ఇంటికో ఉద్యోగం అంటూ బీహార్‌లో మీ మిత్రుడు తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారని, ఏడు కోట్ల మంది ఉన్న ఆ రాష్ట్రంలో ఆ హామీ సాధ్యమేనా అని ఆయన నిలదీశారు. రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రజలకు ఇచ్చే బహుమతి ఏమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెట్టాపట్టాలు వేసుకుని అధికారాన్ని పంచుకున్నాయని ఆయన ఆరోపించారు. 20 శాతం ఓట్ల కోసం దిగజారి మాట్లాడితే 80 శాతం ఉన్న ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. పాముకు పాలు పోసి పెంచినట్లు పాతబస్తీలో మజ్లిస్ పార్టీకి అవకాశమిస్తే ఈరోజు విషనాగులా తయారైందని ఆయన విమర్శించారు.