Shafali Verma: ఫైనల్‌లో షఫాలీ ఆట నాకు ఆశ్చర్యం కలిగించలేదు: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ లానింగ్
- షఫాలీ వర్మను నిలువరించలేమని ముందే గ్రహించానన్న లానింగ్
- కొన్నేళ్లుగా ఆమె దూకుడైన క్రికెట్ ఆడుతోన్న లానింగ్
- ఫైనల్ మ్యాచ్‌లో ఆమె ఇన్నింగ్స్ కొంత చూశానన్న లానింగ్
2025 మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో షఫాలీ వర్మ అద్భుత ప్రదర్శన పట్ల తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలగలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ పేర్కొంది. తన సాధారణ శైలిలోనే మంచి షాట్లు ఆడుతున్న ఆమెను నిలువరించలేమని తాను ముందే గ్రహించానని తెలిపింది.
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌కు ముందు గాయపడిన ప్రతికా రావల్ స్థానంలో షఫాలీ జట్టులోకి వచ్చింది. నవంబర్ 2న డివై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆమె అద్భుత ప్రతిభ కనబరిచింది. స్మృతి మంధనతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె 78 బంతుల్లో 87 పరుగులు చేసింది. భారత మహిళా క్రికెట్ జట్టు మొదటిసారి ప్రపంచ కప్‌ను గెలుచుకోవడంలో షఫాలి వర్మ అద్భుత ప్రదర్శన కీలకపాత్ర పోషించింది.
"షఫాలీ కొన్ని సంవత్సరాలుగా దూకుడైన క్రికెట్ ఆడుతోంది. ఫైనల్ మ్యాచ్‌లో ఆమె ఇన్నింగ్స్‌ను కొంత వరకు చూశాను. ఆమె ప్రదర్శన చూశాక ఆమెను నిలువరించడం కష్టమని అప్పుడే భావించాను" అని మెగ్ లానింగ్ అన్నది.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, ఆల్ రౌండర్ దీప్తి శర్మను కూడా ఆమె ప్రశంసించింది. దీప్తి శర్మ బ్యాట్, బంతితో ఆటను ప్రభావితం చేసిందని తెలిపింది. ఇప్పుడు భారత జట్టుకు దీప్తి శర్మ కీలక క్రికెటర్‌గా మారిందని చెప్పింది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 127 పరుగులతో అజేయంగా నిలిచిన జెమీమా రోడ్రిగ్స్‌పై కూడా ప్రశంసలు కురిపించింది.