Man set in fire: ఆస్తి కోసం మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అల్లుడు.. వికారాబాద్ లో ఘోరం

Son in law Sets Father in law on Fire for Property in Vikarabad
  • తండ్రికి నిప్పంటించడంలో కూతురు సహకారం
  • కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన వృద్ధుడు
  • కూతురు, అల్లుడిపై ఫిర్యాదు.. అరెస్టు చేసిన పోలీసులు
వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఓ అల్లుడు ఘోరానికి పాల్పడ్డాడు. పిల్లనిచ్చిన మామపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘోరానికి బాధితుడి కూతురు కూడా సహకరించడం గమనార్హం. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

జిల్లాలోని యాలాల మండలంలోని బెన్నూరు గ్రామానికి చెందిన కమ్మరి కృష్ణ కులవృత్తి చేసుకుంటూ జీవిస్తున్నాడు. కష్టపడి రెండెకరాల పొలం సంపాదించుకోవడంతో పాటు బెన్నూరులో ఇల్లుకట్టుకున్నాడు. కుమార్తె అనితను గుల్బర్గా జిల్లాలోని చిత్తాపూర్ కు చెందిన అర్జున్ పవార్‌ కు ఇచ్చి వివాహం చేశాడు. ఈ క్రమంలో మామ కృష్ణ ఆస్తిపై కన్నేసిన అర్జున్.. కొంతకాలంగా ఆస్తి తనకు రాసివ్వాలని గొడవపడుతున్నాడు.

గురువారం ఇదే విషయమై మరోసారి కృష్ణతో గొడవపడ్డ అర్జున్.. తీవ్ర ఆగ్రహానికి గురై మామపై పెట్రోల్ కుమ్మరించి నిప్పంటించాడు. అక్కడే ఉన్న అనిత ఈ దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు కన్నతండ్రిని చంపడానికి భర్తకు సహకరించింది. ఒంటికి నిప్పంటుకోవడంతో కృష్ణ కేకలు వేయగా చుట్టుపక్కల వాళ్లు వచ్చి మంటలు ఆర్పారు. చికిత్స కోసం తాండూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. జరిగిన దారుణంపై కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అర్జున్, అనితపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Man set in fire
Property Dispute
Arjun Pawar
Vikarabad
Crime News
Yalal Mandal
Andhra Pradesh Crime
Son-in-law
Attempted Murder
Family Dispute
Police Investigation

More Telugu News