Children: పిల్లలకు టీ తాగిస్తున్నారా.. వెంటనే మాన్పించండి!

Doctor warns against giving tea to children
  • పన్నెండేళ్లలోపు చిన్నారులకు టీ వల్ల అనర్థమేనట
  • పిల్లల ఎదుగుదలపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణుల హెచ్చరిక
  • నిద్రలేమి సహా ఇతరత్రా సమస్యలకు దారితీస్తుందని వెల్లడి
శీతాకాలంలో వెచ్చదనం కోసం తరచుగా టీ తాగడం సాధారణమే.. ఇంట్లో పెద్దలు టీ తాగుతూ పిల్లలకూ అలవాటు చేయడం మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎదిగే పిల్లలకు.. ముఖ్యంగా పన్నెండేళ్లలోపు చిన్నారులకు టీ తాగించడం వల్ల దుష్పరిణామాలు తప్పవని ముంబైకి చెందిన పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ నిహార్ దేశాయ్ పేర్కొన్నారు. టీ తాగడం వల్ల పిల్లల ఎదుగుదలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు.

టీలోని టానిన్స్ పిల్లలు తీసుకునే ఆహారంలోని ఐరన్ ను, ఇతర పోషక పదార్థాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయని, ఫలితంగా పిల్లలు ఐరన్ లోపంతో బాధపడతారని చెప్పారు. టీ లోని కెఫీన్ కేంద్ర నాడీ మండల వ్యవస్థను అలర్ట్ చేసి నిద్రలేమికి కారణమవుతుందని వివరించారు. డీహైడ్రేషన్ కు కూడా కారణమవుతుందని చెప్పారు. పిల్లలకు టీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, వారికి కావాల్సిన ఎలాంటి పోషక పదార్థాలు ఇందులో ఉండవని స్పష్టం చేశారు. టీ తాగించడం కన్నా పిల్లలకు ఇతర పోషకాలు కలిగిన డ్రింక్ ఇవ్వాలని డాక్టర్ నిహార్ దేశాయ్ సూచించారు.
Children
Kids Tea
Tea effects on children
Children health
Iron deficiency
Dr Nihar Desai
Child growth
Caffeine effects
Mumbai
Pediatrician

More Telugu News