Rashmika Mandanna: పెళ్లిపై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. అతని కోసం తూటాకైనా ఎదురెళ్తానని వ్యాఖ్య

Rashmika Mandanna Interesting Comments on Marriage
  • తనకు కాబోయే భర్తపై స్పందించిన రష్మిక మందన్న
  • తనను, తన పనిని అర్థం చేసుకునే వ్యక్తి కావాలన్న రష్మిక
  • తన కోసం యుద్ధం చేయగల ధైర్యం ఉండాలని వ్యాఖ్య
సినీ నటి రష్మిక మందన్న తన పెళ్లి, కాబోయే భర్త గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యంగ్ హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం అయిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తనకు కాబోయే వ్యక్తి ఎలా ఉండాలో రష్మిక మనసులోని మాట బయటపెట్టారు.

తాజాగా ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న రష్మికకు తన భాగస్వామికి ఉండాల్సిన లక్షణాల గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ, "నన్ను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా వైపు నుంచి ప్రతీ విషయాన్ని ఆలోచించాలి. నా పనిని గౌరవించాలి. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి అయితే బాగుంటుంది" అని తెలిపారు.

అంతటితో ఆగకుండా, "మంచి వ్యక్తిత్వంతో పాటు, నా కోసం యుద్ధం చేయగల సత్తా అతనికి ఉండాలి. అలాంటి వ్యక్తి నా జీవితంలోకి వస్తే, అతని కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. అవసరమైతే యుద్ధంలో తూటాకు కూడా ఎదురెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను" అంటూ తన ప్రేమను, నిబద్ధతను తెలియజేశారు. ఆమె చెప్పిన లక్షణాలన్నీ విజయ్ దేవరకొండకు సరిగ్గా సరిపోతాయని, అతడిని ఉద్దేశించే రష్మిక ఈ వ్యాఖ్యలు చేసిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Rashmika Mandanna
Vijay Deverakonda
Rashmika marriage
Telugu cinema
Tollywood actress
Love
Relationship
Future husband
Engagement rumors

More Telugu News