Vijay: నటుడు విజయ్ గాలిలో మేడలు కడుతున్నారు.. అప్పుడే సీఎం అయినట్లు మాట్లాడుతున్నారు: వైగో

Vaiko Criticizes Actor Vijays Political Aspirations
  • విజయ్ పేరును ప్రస్తావించకుండా విమర్శలు
  • పేపరు పడవపై సముద్రాన్ని దాటే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్య
  • ఆయన కలలన్నీ ఎండమావిలా మారిపోతాయన్న వైగో
సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ గాలిలో మేడలు కడుతున్నారని, ఇప్పటికే ముఖ్యమంత్రి అయినట్లుగా మాట్లాడుతున్నారని ఎండీఎంకే అధినేత వైగో విమర్శలు గుప్పించారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్యే పోటీ ఉంటుందని విజయ్ చేసిన వ్యాఖ్యలపై వైగో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ పేరును ప్రస్తావించకుండా ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు.

"ఆయన అప్పుడే ముఖ్యమంత్రి అయినట్లు మాట్లాడుతున్నారు. రాజకీయాలలో ఓనమాలు కూడా తెలుసుకోకుండా కాగితపు పడవపై సముద్రాన్ని దాటే ప్రయత్నం చేస్తున్నారు. గాలిలో మేడలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కలలన్నీ ఎండమావిలా మారుతాయని ఇదివరకే చెప్పా" అని వైగో అన్నారు.

కరూర్ తొక్కిసలాట ఘటనలో బాధితులను విజయ్ మహాబలిపురంలోని ఒక రిసార్టుకు ఆహ్వానించడంపై వైగో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను వారి నివాసాలలోనే పరామర్శించకుండా రిసార్టుకు పిలిపించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. తమిళనాడు చరిత్రలో ఇటువంటి పరిణామం ఎప్పుడూ చూడలేదని, ఇదో కుట్ర అని వైగో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vijay
Vijay TVK Party
Vaiko
Tamil Nadu Politics
DMK
Tamil Nadu Assembly Elections
Karur Stampede

More Telugu News