Chiranjeevi: ఉర్రూత లూగించే స్టెప్పులతో వారెవ్వా మెగాస్టార్ అనిపించడానికి సిద్ధమవుతున్నారు: గంటా శ్రీనివాసరావు

Chiranjeevi Ready to Amaze with Energetic Steps Says Ganta
  • 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా సెట్స్‌లో చిరంజీవిని కలిసిన గంటా
  • యంగ్ అండ్ ఎనర్జిటిక్ లుక్‌లో చిరు అదరగొడుతున్నారన్న గంటా
  • యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారని ప్రశంస
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
  • సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్‌లో చిరంజీవిని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలుసుకున్నారు. అనంతరం చిరంజీవి నూతన లుక్, సినిమాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఈ సినిమా కోసం చిరంజీవి యంగ్ అండ్ ఎనర్జిటిక్ లుక్‌లోకి మారిపోయారని గంటా ప్రశంసించారు. "అన్నయ్య నటన నిత్య నూతనం. ప్రతి సినిమాకి ఆయనలోని ప్రతిభ కొత్త పుంతలు తొక్కుతుంది. ఈ సినిమా కోసం ఆయన యువ హీరోలకు పోటీ ఇచ్చేలా సిద్ధమవుతున్నారు" అని గంటా తన పోస్టులో పేర్కొన్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ స్పాట్‌లో చిరంజీవిని కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పినట్లు ఆయన తెలిపారు. సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే స్టెప్పులతో మెగాస్టార్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారని గంటా అభిప్రాయపడ్డారు.

కాగా, ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి లుక్‌పై గంటా చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Chiranjeevi
Manasankara Varaprasad Garu
Anil Ravipudi
Ganta Srinivasa Rao
Tollywood
Telugu cinema
Sankranti release
Mega star
Chiranjeevi new movie
Chiranjeevi look

More Telugu News