Ayyappa Swamy: శబరిమల వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త

South Central Railway Announces Special Trains for Sabarimala Ayyappa Pilgrims
  • శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించిన రైల్వే శాఖ
  • నవంబరు, డిసెంబరు, జనవరి తేదీల్లో రైళ్లు నడపనున్న రైల్వే శాఖ
  • చర్లపల్లి, నర్సాపూర్, మచిలీపట్నం స్టేషన్ల నుండి రైళ్లు
శబరిమల వెళ్లే ఉభయ తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల మీదుగా శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో వివిధ తేదీలలో అందుబాటులో ఉంటాయి.

నవంబరు 17, 24 తేదీల్లో, డిసెంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో, జనవరి 5, 12, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి కొల్లాంకు రైళ్లు నడుస్తాయి. 

నవంబరు 19, 26 తేదీల్లో, డిసెంబరు 3, 10, 17, 24, 31 తేదీల్లో, జనవరి 7, 14, 21 తేదీల్లో కొల్లాం నుంచి చర్లపల్లికి రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు పగిడిపల్లి, గుంటూరు, గూడురు, రేణిగుంట మీదుగా నడుస్తాయి.

నవంబరు 16, 23, 30 తేదీల్లో, డిసెంబరు 7, 14, 21, 28 తేదీల్లో, జనవరి 4, 11, 18 తేదీల్లో నర్సాపూర్ నుంచి కొల్లాంకు రైళ్లు నడుస్తాయి.

నవంబరు 18, 25, 30 తేదీల్లో, డిసెంబరు 9, 16, 23, 30 తేదీల్లో, జనవరి 6, 13, 20 తేదీల్లో కొల్లాం నుంచి నర్సాపూర్‌కు రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు విజయవాడ, గూడూరు, రేణిగుంట మీదుగా వెళతాయి.

నవంబరు 14, 21, 28 తేదీల్లో, డిసెంబరు 26, జనవరి 02 తేదీల్లో మచిలీపట్నం నుంచి కొల్లాంకు రైళ్లు నడుస్తాయి.

నవంబరు 16, 23, 30 తేదీల్లో, డిసెంబరు 28, జనవరి 04 తేదీల్లో కొల్లాం నుంచి మచిలీపట్నంకు రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయి.

డిసెంబరు 05, 12, 19 తేదీల్లో, జనవరి 09, 16 తేదీల్లో మచిలీపట్నం నుంచి కొల్లాంకు, డిసెంబరు 7, 14, 21 తేదీల్లో, జనవరి 11, 18 తేదీల్లో కొల్లాం నుంచి మచిలీపట్నంకు రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు గుంటూరు, నంద్యాల, కడప, రేణిగుంట మీదుగా వెళతాయి.
Ayyappa Swamy
Sabarimala
South Central Railway
Special Trains
Telugu States
Kollam

More Telugu News