Jagan: వందేమాతరానికి 150 ఏళ్లు.. జగన్ ట్వీట్

Jagan Salutes Vande Mataram on 150th Anniversary
  • "150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం" అంటూ జగన్ ట్వీట్
  • స్వాతంత్ర్య సమరయోధుల్లో ఐక్యత రగిలించిన గీతమన్న జగన్
  • భావతరాల కోసం కలిసి పనిచేద్దామని ప్రజలకు పిలుపు
జాతీయ గేయం 'వందేమాతరం' రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన 'ఎక్స్' వేదికగా ఒక ట్వీట్ చేశారు. "150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం" అంటూ జాతీయ గేయానికి నీరాజనాలర్పించారు.

బంకించంద్ర ఛటర్జీ రచించిన ఈ పవిత్ర గీతం మన స్వాతంత్ర్య సమరయోధుల్లో గొప్ప ఐక్యతా భావాన్ని రగిలించిందని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఆ స్ఫూర్తే మనందరికీ ఆదర్శమని తెలిపారు. అదే స్ఫూర్తితో మన భవిష్యత్ తరాల కోసం, వారి అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

భారత స్వాతంత్ర్యోద్యమంలో 'వందేమాతరం' ఒక శక్తిమంతమైన రణనినాదంగా నిలిచింది. ప్రముఖ రచయిత బంకించంద్ర ఛటర్జీ 1875 నవంబర్ 7న ఈ గీతాన్ని రచించారు. అనంతరం 1882లో ఆయన రాసిన బెంగాలీ నవల ‘ఆనందమఠ్’లో దీనిని తొలిసారిగా ప్రచురించారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఈ గీతాన్ని జాతీయ గేయంగా అధికారికంగా ప్రకటించారు.
Jagan
YS Jagan
Vande Mataram
National Anthem
Bankim Chandra Chatterjee
Anandamath
Indian Independence Movement
National Song
YS Jagan Tweet

More Telugu News