Riya Sardar: పశ్చిమ బెంగాల్‌లో పెద్దలను కాదని వివాహం చేసుకున్న ఇద్దరు యువతులు

Riya Sardar and Rakhi Naskar same sex marriage in West Bengal
  • సుందర్బన్స్ మారుమూల ప్రాంతంలో ఘటన
  • గుడిలో పెళ్లి చేసుకున్న రియా, రాఖీ
  • రెండేళ్ల క్రితం నాటి పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి
పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్స్ మారుమూల ప్రాంతంలో ఇద్దరు యువతులు సామాజిక కట్టుబాట్లను పక్కనబెట్టి ప్రేమ వివాహం చేసుకున్నారు. మందిర్‌బజార్‌కు చెందిన రియా సర్దార్, బకుల్తాలాకు చెందిన రాఖీ నస్కర్ రెండేళ్ల క్రితం కలుసుకున్నారు. ఆ తర్వాత వారు తరుచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారి వివాహానికి దారితీసింది. వృత్తిరీత్యా డ్యాన్సర్లు అయిన వీరి వివాహం ఒక దేవాలయంలో జరిగింది.

రియా చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమె తన అత్తామామల వద్ద పెరిగింది. రాఖీకి సొంత కుటుంబం ఉంది. రాఖీతో తనకున్న సంబంధం గురించి రియా తన అత్తామామలు, ఇతర బంధువులతో చెప్పినప్పుడు వారు అంగీకరించలేదు. దీంతో వారికి చెప్పకుండానే రియా ఇంటి నుంచి వెళ్లిపోయింది.

వీరి వివాహానికి రేఖ అనే మహిళ కుటుంబం మద్దతునిచ్చింది. రియా అక్కడకి చేరుకుంది. స్థానిక ఆలయంలో ఇద్దరు యువతులు దండలు మార్చుకుని నూతన జీవితంలోకి అడుగుపెట్టారు.

వివాహం అనంతరం రియా, రేఖా మీడియాతో మాట్లాడుతూ ప్రేమకు లింగభేదం, హద్దులు లేవని స్పష్టం చేశారు. నిజమైన ప్రేమే ముఖ్యమని వారు పేర్కొన్నారు. "మేము మా స్వంత కోరికలను గౌరవించాం. ప్రేమ నిజంగా ముఖ్యమైనది. ఒక స్త్రీ పురుషుడిని మాత్రమే ప్రేమించగలదని లేదా ఒక పురుషుడు స్త్రీని మాత్రమే ప్రేమించగలడని ఎవరు నిర్ణయించారు? ఒక స్త్రీ మరొక స్త్రీని కూడా ప్రేమించగలదు" అని వారు అన్నారు.
Riya Sardar
Rakhi Naskar
West Bengal
same sex marriage
India
Sundarban
lesbian wedding

More Telugu News