Katrina Kaif: తల్లిదండ్రులైన బాలీవుడ్ జంట.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్

Vicky Kaushal Katrina Kaif Welcome Baby Boy
  • బాలీవుడ్ జంట కత్రినా, విక్కీ కౌశల్‌కు మగబిడ్డ జననం
  • సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించిన స్టార్ కపుల్
  • పెళ్లయిన నాలుగేళ్లకు తల్లిదండ్రులుగా ప్రమోషన్
  • 2021 డిసెంబర్‌లో రాజస్థాన్‌లో వీరి వివాహం
  • విక్కీ, కత్రినా జంటకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
బాలీవుడ్ ప్రముఖ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఈ స్టార్ కపుల్ శుక్రవారం తల్లిదండ్రులయ్యారు. కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను వారు స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 

2021 డిసెంబర్ 9న రాజస్థాన్ వేదికగా కత్రినా, విక్కీ కౌశల్ వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. పెళ్లయిన నాటి నుంచి కత్రినా గర్భవతి అయ్యారంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. అయితే, వాటన్నింటికీ తెరదించుతూ ఈ ఏడాది సెప్టెంబర్ 23న తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఈ జంట అధికారికంగా ప్రకటించింది. అప్పట్లో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసిన కత్రినా, "ఆనందం నిండిన హృదయాలతో మా జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం" అని పేర్కొన్నారు.

తాజాగా మగబిడ్డకు జన్మనివ్వడంతో కత్రినా-విక్కీ దంపతుల కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ విషయం తెలియగానే అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లయిన నాలుగేళ్లకు తల్లిదండ్రులుగా మారిన ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Katrina Kaif
Vicky Kaushal
Bollywood couple
Baby boy
Newborn
Parents
Bollywood news
Celebrity baby
Katrina Kaif pregnancy
Indian celebrity

More Telugu News