Nagarjuna: 'శివ' సినిమా నాగార్జున కంటే ముందు మరో స్టార్ హీరో వద్దకు వెళ్లిందనే సంగతి తెలుసా?
- 36 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి నాగార్జున 'శివ'
- నవంబర్ 14న 4కే డాల్బీ ఆట్మాస్ వెర్షన్‌లో విడుదల
- 'శివ' చిత్రానికి హీరోగా వెంకటేశ్ మొదటి ఎంపిక
- ఫ్యామిలీ ఇమేజ్ దెబ్బతింటుందని వద్దన్న రామానాయుడు
- నాగార్జున అయితే కరెక్ట్ అని సూచించింది కూడా ఆయనే
కింగ్ నాగార్జున కెరీర్‌ను మలుపు తిప్పిన కల్ట్ క్లాసిక్ చిత్రం 'శివ' మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో వచ్చిన ఈ ట్రెండ్‌సెట్టర్ మూవీ, 36 సంవత్సరాల తర్వాత సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 14న ఈ చిత్రాన్ని 4కే డాల్బీ ఆట్మాస్ టెక్నాలజీతో రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన పాత విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన ఈ చిత్రంలో హీరోగా నాగార్జున మొదటి ఎంపిక కాదనే వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ కథను ముందుగా విక్టరీ వెంకటేశ్ కోసం సిద్ధం చేసుకున్నారట. ఈ మేరకు ఆయన మూవీ మొఘల్ డి. రామానాయుడిని కలిసి కథ వినిపించగా, ఆయనకు కథ బాగా నచ్చినట్లు సమాచారం.
అయితే, అప్పటికే వెంకటేశ్ కుటుంబ కథా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సమయంలో ఇంతటి యాక్షన్, హింస ఉన్న పాత్ర చేస్తే ఆయన ఇమేజ్‌కు సరిపోదని, ప్రేక్షకులు అంగీకరించరేమోనని భావించి రామానాయుడు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
వెంకటేశ్ కుదరకపోవడంతో, ఈ కథకు ఎవరు సరిపోతారని వర్మ తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో, స్వయంగా రామానాయుడే ఒక సలహా ఇచ్చారట. రొమాంటిక్ లవ్ స్టోరీలతో దూసుకెళ్తున్న నాగార్జున అయితే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని, కొత్తగా ఉంటుందని ఆయన సూచించినట్లు సమాచారం. రామానాయుడి సూచనతో వర్మ ఈ కథను నాగార్జునకు వినిపించడం, ఆయన వెంటనే అంగీకరించడం జరిగిపోయాయి.
అలా తెరకెక్కిన 'శివ' తెలుగు సినిమా గతిని మార్చేసింది. నాగార్జునను ఓవర్‌నైట్ స్టార్‌గా మార్చడమే కాకుండా, అప్పట్లోనే దాదాపు రూ. 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా రీ-రిలీజ్ అవుతుండటంతో ఈ పాత విషయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.