Peddi Movie: 'పెద్ది' నుంచి 'చికిరి' సాంగ్ వచ్చేసింది.. హుక్ స్టెప్పులతో ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ అదిరిపోయే ట్రీట్

Ram Charan Peddi Chikiri Chikiri Song Released
  • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా నుంచి 'చికిరి చికిరి' వీడియో సాంగ్ విడుదల
  • హుక్ స్టెప్పులతో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న మెగాపవర్ స్టార్
  • ఏఆర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన ఈ పాటను ఆలపించిన మోహిత్ చౌహాన్ 
  • జాన్వీ కపూర్‌ను ఊహించుకుంటూ చరణ్ చేసిన డ్యాన్స్ హైలైట్‌
  • బుచ్చిబాబు దర్శకత్వంలో ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో చిత్రం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' నుంచి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'చికిరి చికిరి' పాట పూర్తి వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. కేవలం లిరికల్ వీడియో కాకుండా నేరుగా పూర్తి వీడియో సాంగ్‌ను విడుదల చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ పాటలో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్స్ సింప్లీ సూప‌ర్బ్ అనే చెప్పాలి.

ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ చరణ్ 'పెద్ది' అనే పాత్రలో కనిపించనుండగా, ఆయన సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా విడుదలైన పాటలో, తన ప్రేయసి 'చికిరి'ని ఊహించుకుంటూ 'పెద్ది' కొండ అంచున నిలబడి నృత్యం చేసే సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. "ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క... నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా" అంటూ సాగే సాహిత్యం మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. సాధారణ ఫ్యాంటు, షర్టు ధరించి మెడలో కర్చీఫ్ కట్టుకుని చరణ్ వేసిన సిగ్నేచర్ స్టెప్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం పాటకు ప్రాణం పోసింది. మోహిత్ చౌహాన్ గాత్రం ఆకట్టుకుంది. "కాటుక అక్కర్లేని కళ్లు... అలంకరణ అక్కర్లేని అరుదైన నా చికిరి" వంటి పంక్తులు సాహిత్యం విలువలను చాటిచెబుతున్నాయి.

'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్ప‌టికే ప్రకటించింది.

Peddi Movie
Ram Charan
Chikiri Chikiri song
Buchi Babu Sana
AR Rahman music
Janhvi Kapoor
Rural drama
Telugu movie
Hook steps
Mythri Movie Makers

More Telugu News