KTR: గ్రహణం వీడాలి.. కేసీఆర్ రావాలి: కేటీఆర్

KTR Criticizes Congress Rule Calls for KCRs Return
  • రాష్ట్రానికి, హైదరాబాద్‌కు కాంగ్రెస్ పాలన గ్రహణంలా పట్టిందన్న కేటీఆర్
  • తమ పదేళ్ల పాలనలో హైదరాబాద్ అభివృద్ధి అప్రతిహతంగా సాగిందని వెల్లడి
  • రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నగరం కీర్తి మసకబారిందని విమర్శ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి, ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి పట్టిన గ్రహణం వీడాలంటే మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఈరోజు తన ఎక్స్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు.

2014 నుంచి 2023 వరకు కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధి అప్రతిహతంగా కొనసాగిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ పదేళ్లలో ఐటీ, ఫార్మా సహా అన్ని రంగాలు వేగంగా అభివృద్ధి చెందాయని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెల్లువెత్తాయని, శాంతిభద్రతల పరిరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ప్రతీ అంశంలోనూ తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని పేర్కొన్నారు. ఆ అభివృద్ధి ఫలాలు నగరంలోని ప్రతి పౌరుడికీ అందాయని, హైదరాబాద్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టామని ఆయన కొనియాడారు.

అయితే, గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నగరం కీర్తి మసకబారిందని కేటీఆర్ విమర్శించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు. "రాష్ట్రానికి, హైదరాబాదుకు పట్టిన ఈ గ్రహణం వీడాలి. మళ్లీ కేసీఆర్ రావాలి" అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.
KTR
KTR BRS
KTR Comments
Telangana Politics
KCR
Congress Government Telangana
Hyderabad Development
Telangana Development
Revanth Reddy
BRS Party

More Telugu News