Indian Student Death: రష్యాలో భారత విద్యార్థి అదృశ్యం విషాదాంతం... డ్యామ్‌లో లభించిన మృతదేహం

Missing Indian Students Body Found In Russia Dam
  • రష్యాలో అదృశ్యమైన భారత వైద్య విద్యార్థి మృతి
  • 19 రోజుల తర్వాత డ్యామ్‌లో లభ్యమైన మృతదేహం
  • పాలు కొనేందుకు హాస్టల్ నుంచి వెళ్లి తిరిగిరాని వైనం
  • రాజస్థాన్‌కు చెందిన అజిత్ సింగ్‌గా గుర్తింపు
  • అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరపాలని డిమాండ్
రష్యాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. 19 రోజుల క్రితం కనిపించకుండా పోయిన అజిత్ సింగ్ చౌదరి (22) అనే యువకుడి మృతదేహం గురువారం ఓ డ్యామ్‌లో లభ్యమైంది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా కఫన్‌వాడ గ్రామానికి చెందిన అజిత్ సింగ్, 2023లో ఎంబీబీఎస్ చదివేందుకు రష్యాలోని ఉఫా నగరంలో ఉన్న బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చేరాడు. ఈ ఏడాది అక్టోబర్ 19న ఉదయం 11 గంటల సమయంలో పాలు కొనుక్కొని వస్తానని చెప్పి హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి అతను తిరిగి రాలేదు.

ఈ క్రమంలో గురువారం వైట్ నదికి సమీపంలో ఉన్న ఓ డ్యామ్‌లో అజిత్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. 19 రోజుల క్రితమే నది ఒడ్డున అతని బట్టలు, మొబైల్ ఫోన్, బూట్లు లభించాయి. మృతదేహాన్ని అతని స్నేహితులు గుర్తించినట్లు ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ధ్రువీకరించింది. అజిత్ మరణవార్తను రష్యాలోని భారత రాయబార కార్యాలయం గురువారం అతని కుటుంబ సభ్యులకు తెలియజేసింది.

ఈ ఘటనపై కేంద్ర మాజీ మంత్రి జితేంద్ర సింగ్ అల్వార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో, ఎన్నో ఆశలతో కుటుంబం అజిత్‌ను రష్యాకు పంపింది. అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక ఆశాకిరణాన్ని కోల్పోయాం" అని ఆయన ఆవేదన వ్య‌క్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కోరారు. ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Indian Student Death
Ajit Singh Choudhary
Russia
Bashkir State Medical University
Ufa city
Alwar Rajasthan
MBBS student
missing student Russia
Indian embassy Russia
White River

More Telugu News