The Girlfriend Movie: రష్మిక 'ది గర్ల్‌ఫ్రెండ్'.. కచ్చితంగా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది: విజయ్ దేవరకొండ

Rashmikas The Girlfriend Release Vijay Deverakonda Shares Special Post
  • రష్మిక 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రానికి విజయ్ దేవరకొండ మద్దతు
  • ఈ సినిమా కచ్చితంగా ప్రభావం చూపుతుందని వ్యాఖ్య
  • నటీనటులందరూ అద్భుతంగా నటించారని ప్రశంస
  • గీతా ఆర్ట్స్ సమర్పణలో నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు ముందు, హీరో విజయ్ దేవరకొండ చిత్ర బృందంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా చాలా శక్తిమంతంగా ఉంటుందని, కచ్చితంగా ప్రేక్షకులపై ప్రభావం చూపుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ మేరకు విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. "వాళ్లు ఒక పవర్‌ఫుల్ సినిమా తీశారని నాకు తెలుసు. ఇది చాలా ముఖ్యమైన చిత్రం. దీన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఈ సినిమాలో నటీనటులందరి నటన అద్భుతంగా ఉంటుంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్.. రష్మిక, ధీక్షిత్, అను ఇమ్మాన్యుయేల్‌తో కలిసి సృష్టించిన ఈ సినిమా కచ్చితంగా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. "థియేటర్లలో ఈ సినిమాను వీక్షించి అనుభూతి చెందండి, ఆలోచించండి. చిత్ర బృందానికి నా ప్రేమ, అభినందనలు" అని విజయ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఇక‌, కొంతకాలంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల నిశ్చితార్థం జరిగిపోయిందని, వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై ఇరువర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
The Girlfriend Movie
Rashmika Mandanna
Vijay Deverakonda
Rahul Ravindran
Telugu Movie Release
Deekshith Shetty
Anu Emmanuel
Tollywood News

More Telugu News