Marigalu: నిధి చుట్టూ తిరిగే కన్నడ కథ .. దూసుకుపోతున్న 'మారిగల్లు'

Maarigallu Web Series Update
  • కన్నడలో రూపొందిన 'మారిగల్లు'
  • ఆసక్తికరమైన కథ
  • ఆకట్టుకునే కథనం
  • హైలైట్ గా నిలిచే లొకేషన్స్ 
  • మెప్పించే ఫొటోగ్రఫీ - బీజీఎమ్

కన్నడ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన సిరీస్ లకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. తాజాగా ఆ జాబితాలోకి 'మారిగల్లు' కూడా చేరిపోయింది. దేవరాజ్ పూజారి దర్శకత్వం వహించిన సిరీస్ ఇది. అశ్వనీ పునీత్ రాజ్ కుమార్ నిర్మించిన ఈ సిరీస్, అక్టోబర్ 31వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. 6 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, కన్నడలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.

ఈ సిరీస్ ఇంతగా ఆకట్టుకోవడానికి కారణం కథాకథనాలు అనే మాట వినిపిస్తోంది. కదంబరాజుల కాలానికీ .. 1990ల నాటి కాలానికి మధ్యలో ఈ కథ నడుస్తుంది. ఈ రెండు కాలాలకి సంబంధించిన కథ ఆసక్తికరమైన కథనంతో ముందుకు వెళ్లడం ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. కథకి తగిన లొకేషన్స్ .. పాత్రలకి తగిన ఆర్టిస్టులు .. సందర్భానికి తగిన లొకేషన్స్ ఈ సిరీస్ కి ప్రధానమైన బలంగా నిలిచాయని అంటున్నారు. లైటింగ్ .. నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తున్నాయని అంటున్నారు. 

కథ విషయానికొస్తే, దట్టమైన అడవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామమే 'మారిగల్లు'. ఆ గ్రామస్తులు తమ గ్రామ దేవత 'మారి' పట్ల పూర్తి విశ్వాసంతో ఉంటారు. ఆ గ్రామంలో పెద్ద మనిషిగా చెలామణి అయ్యే మాస్టర్, ప్రాచీన శిలాఫలకాలను రహస్యంగా సేకరిస్తూ ఉంటాడు. అతని దగ్గరికి అప్పు కోసం వచ్చిన 'వరద' కంట ఆ శాసనాలు పడతాయి. అందులోకి ఒక శాసనాన్ని అతను తీసుకుని వెళ్లి, పురావస్తు శాఖకి చెందిన అధికారి ముందు ఉంచుతాడు. అది కదంబరాజుల కాలంలో దాచబడిన నిధి తాలూకు శాసనమని అతనికి అర్థమవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనేది మిగతా కథ.

Marigalu
Marigalu series
Kannada series
ZEE5
Ashwini Puneeth Rajkumar
Devaraj Poojari
Kadamba dynasty
Treasure hunt
Kannada movies
OTT streaming

More Telugu News