Adhire Abhi: అందుకే హైపర్ ఆదిని అడగలేదు: అదిరే అభి

Adire Abhi Interview
  • నటుడిగా అదిరే అభికి మంచి పేరు 
  • దర్శకత్వం దిశగా అడుగులు 
  • రాజ్ తరుణ్ తో 'చిరంజీవ'సినిమా 
  • రేపటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ 
  • అందుకే హైపర్ ఆదిని తీసుకోలేదని వెల్లడి  

అభినయ కృష్ణ అంటే ఎవరికీ పెద్దగా తెలియదు .. 'అదిరే అభి' అనగానే వెంటనే గుర్తుపట్టేస్తారు. అందుకు కారణం ఆయన ఆ పేరుతో 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా పాప్యులర్ కావడమే. 'అభి' చాలామందికి నటుడిగా మాత్రమే తెలుసు. ఆయనకి రచన పట్ల .. దర్శకత్వం పట్ల కూడా మంచి అవగాహన .. అనుభవం ఉన్నాయి. అందువలన దర్శకుడిగా ఆయన 'చిరంజీవ' అనే ఒక సినిమాను రూపొందించాడు.

రాజ్ తరుణ్ - కుషిత జంటగా అభి రూపొందించిన ఈ సినిమా, ఈ నెల 7వ తేదీన 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో 'అభి' బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అనేక విషయాలను ప్రస్తావించాడు." ఈ సినిమాలో హైపర్ ఆదిని తీసుకోకపోవడం గురించే అంతా అడుగుతున్నారు. నిజానికి నేను అడిగితే అతను చిన్న సీన్ అయినా చేస్తాడు. కానీ ఆదితో అంత చిన్న సీన్స్ చేయించాలని నేను అనుకోవడం లేదు" అని అన్నాడు. 

"నేను దర్శకుడిగా ఒక ప్రాజెక్టును సెట్ చేసుకుంటున్నప్పుడు, ఒక ప్రొడక్షన్ హౌస్ దగ్గర అది ఆగిపోయింది. ఆ ప్రొడక్షన్ వాళ్లకి ఆది బాగా పరిచయం. అతనితో ఒక మాట చెప్పిస్తే అయిపోతుందని కొంతమంది  నాకు చెప్పారు కూడా. కానీ నేను హైపర్ ఆదిని అడగలేదు. ఎందుకంటే మా మధ్య స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఆయనను ఇబ్బంది పెట్టదలచుకోలేదు. అంతకుమించి ఇందులో ఏమీ లేదు" అని సమాధానమిచ్చాడు. 

Adhire Abhi
Abhinaya Krishna
Chiranjeeva Movie
Raj Tarun
Kushita
Aha Streaming
Hyper Aadi
Jabardasth Comedy Show
Telugu Cinema
Movie Promotions

More Telugu News