Bandi Sanjay: పదో తరగతి విద్యార్థులందరికీ పరీక్ష ఫీజు చెల్లించాలని బండి సంజయ్ నిర్ణయం!

Bandi Sanjay to Pay Exam Fee for 10th Class Students
  • కరీంనగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఫీజు చెల్లింపు
  • ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసిన బండి సంజయ్
  • తన వేతనం నుంచి ఫీజు నిమిత్తం రూ. 15 లక్షలు ఇవ్వాలని నిర్ణయం
కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ తన నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థులకు ఒక శుభవార్తను అందించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల పదో తరగతి పరీక్ష ఫీజును తాను చెల్లిస్తానని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు.

కరీంనగర్ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో 12,292 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. కరీంనగర్ జిల్లాలో 4,847, సిరిసిల్ల జిల్లాలో 4,059, సిద్దిపేట జిల్లాలో 1,118, జగిత్యాల జిల్లాలో 1,135, హన్మకొండ జిల్లాలో 1,133 మంది విద్యార్థులు ఉన్నారు. వీరి పరీక్ష ఫీజుల కోసం దాదాపు రూ. 15 లక్షలు ఖర్చవుతుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులలో ఎక్కువ మంది దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారే. చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు కూలి వంటి చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకున్న బండి సంజయ్, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఫీజును తానే చెల్లించాలని నిర్ణయించుకున్నారు. ఈ మొత్తాన్ని తన వేతనం నుంచి చెల్లించాలని బండి సంజయ్ నిర్ణయించారు.
Bandi Sanjay
SSC Exams
Telangana
10th Class Fee
Karimnagar
Government Schools
Education

More Telugu News