Christopher Luxon: ఆస్ట్రేలియాపై భారత్ గెలిచినందుకు సంతోషంగా ఉంది: న్యూజిలాండ్ ప్రధాని

Christopher Luxon Happy with India Win Over Australia
  • ప్రపంచ కప్ సాధించిన మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపిన క్రిస్టఫర్
  • సెమీ ఫైనల్లో ప్రదర్శన తనకు ఎంతో నచ్చిందని వ్యాఖ్య
  • భారత్, దక్షిణాఫ్రికా హైలెట్స్ చూశానని వెల్లడి
ప్రపంచ కప్‌ను న్యూజిలాండ్ గెలుచుకోకపోయినా... భారత్ విజయం సాధించాలని తాను కోరుకున్నానని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లుక్సాన్ పేర్కొన్నారు. ప్రపంచ కప్ సాధించిన భారత క్రికెట్ మహిళా జట్టును ఆయన అభినందించారు. ముఖ్యంగా సెమీఫైనల్లో కఠినమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను భారత జట్టు ఓడించడం తనకు ఎంతో నచ్చిందని అన్నారు.

భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ హైలైట్స్‌‌ను తాను చూశానని ఆయన తెలిపారు. ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు అభినందనలు తెలియజేశారు. భారత జట్టు ప్రపంచస్థాయి జట్టు అని, వారి ఆట తీరు అద్భుతమని ప్రశంసించారు. ప్రపంచ కప్ గెలవడానికి వారు పూర్తిగా అర్హులని అన్నారు. న్యూజిలాండ్ గెలిస్తే బాగుండేదని, అయినప్పటికీ తమ జట్టు ఆట తీరు పట్ల గర్వపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఆస్ట్రేలియాను ఏ జట్టు ఓడించినా తాము సంతోషిస్తామని, భారత్ ఈ విషయంలో ముందుంటుందని అన్నారు.
Christopher Luxon
New Zealand Prime Minister
India cricket
Cricket World Cup
India vs Australia

More Telugu News