భానుప్రియ ఫ్యామిలీ నేపథ్యం ఇదేనట!
- పేద కుటుంబంలో పుట్టి పెరిగిన భానుప్రియ
- ఆమె తండ్రి ఓ సాధారణ టైలర్
- డాన్స్ పట్ల ఆసక్తి చూపుతూ వెళ్లిన తీరు
- తల్లి ప్రోత్సాహంతో నటన వైపుకు
- వరుస హిట్స్ తో స్టార్ గా ఎదిగిన వైనం
"భానుప్రియ అసలు పేరు మంగభాను. ఆమెకి శాంతి అనే చెల్లెలు .. గోపాలకృష్ణ అనే అన్నయ్య ఉన్నారు. భానుప్రియ తండ్రి ఒక చిన్న టైలర్ .. తల్లి అతనికి సాయపడుతూ ఉండేది. ఆ తరువాత ఆయన మద్రాస్ కి మకాం మార్చి, సినిమా కంపెనీలలో టైలర్ గా పనిచేయడం మొదలుపెట్టాడు. భానుని హీరోయిన్ ను చేయాలనేది తల్లి ఆలోచన. అందువలన నాట్యం నేర్పిస్తూ, ఆ దిశగా ఆమె ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. అలా తమిళ సినిమాతో భానుప్రియ ఎంట్రీ ఇచ్చారు.
తెలుగులో 'సితార'.. 'అన్వేషణ' .. 'ప్రేమించు పెళ్లాడు' ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ సమయంలోనే భానుప్రియను వంశీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు .. కానీ అందుకు భానుప్రియ తల్లి ఒప్పుకోలేదు. వంశీకి అప్పటికే పెళ్లి అయిన కారణంగా, ఆ విషయం పట్లనే ఆమె అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. కాస్త అమాయకురాలైన భానుప్రియ, ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆ తరువాత 'స్వర్ణకమలం' సినిమాతో భానుప్రియ రేంజ్ మారిపోయింది. ఆ తరువాత వరుస హిట్స్ తో దూసుకుపోయారు" అని చెప్పారు.