Varsha Bollamma: అసలు కథ ఇప్పుడే మొదలు .. క్రైమ్ థ్రిల్లర్ నుంచి సీజన్ 2

Constable Kanakam Season 2 Update
  • ఆసక్తిని రేకెత్తించిన 'కానిస్టేబుల్ కనకం'
  • 6 ఎపిసోడ్స్ తో ఫస్టు సీజన్ 
  • ప్రధాన పాత్రలో వర్ష బొల్లమ్మ 
  • ఆకట్టుకున్న క్రైమ్ థ్రిల్లర్
  • వచ్చేనెల నుంచి రెండో సీజన్ మొదలు

ఈటీవీ విన్ నుంచి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'కానిస్టేబుల్ కనకం'. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో, వర్ష బొల్లమ్మ ప్రధానమైన పాత్రను పోషించింది. కనకమహాలక్ష్మి పాత్రను ఆమె పోషించింది. 6 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ను అందించారు. ఆగస్టు 14వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. కథాకథనాల పరంగా ఈ సిరీస్ మంచి మార్కులు కొట్టేసింది. 

అడవిగుట్టను ఆనుకుని ఉన్న రేపల్లె గ్రామం .. అటు వైవు వెళ్లడానికి ఎవరూ సాహసించరు. ఆ ఊరుకి చెందిన పెళ్లీడు పిల్లలు అదృశ్యమవుతూ ఉంటారు. అయినా కారణాలు అన్వేషించే సాహసం ఎవరూ చేయరు. అలాంటి పరిస్థితులలో ఆ గ్రామానికి వచ్చిన కనకానికి, చంద్రిక కేసు నుంచి అనుమానం మొదలవుతుంది. దాంతో ఆమె తీగలాగడం మొదలుపెడుతుంది. ప్రెసిడెంట్ ఆగ్రహానికి గురవుతుంది. ఇలా ఈ కేసు పూర్తి కాకముందే ఫస్టు సీజన్ పూర్తయింది. 

ఇప్పుడు ఈ సిరీస్ నుంచి రెండో సీజన్ ను వదలడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్టుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. వచ్చేనెలలో మొదలుకానున్న సీజన్ లో, థ్రిల్స్ .. మిస్టరీ .. ఎమోషన్స్ రెట్టింపు కానున్నట్టుగా చెప్పారు. దాంతో సీజన్ 2 మరింత ఉత్కంఠను రేకెత్తించడం ఖాయంగానే కనిపిస్తోంది. 

Varsha Bollamma
Constable Kanakam
ETV Win
Telugu crime thriller
Web series season 2
Repalle village
Adavigutta
Prashanth Kumar Dimmala
Telugu OTT
Crime mystery

More Telugu News