Revanth Reddy: బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే పరిస్థితి ఉంది.. ఈ విషయాన్ని కవిత చెప్పారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy Says BRS May Merge with BJP Kavitha Told Him
  • బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని విమర్శ
  • బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందన్న ముఖ్యమంత్రి
  • జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ మైనారిటీలకు భరోసా ఇచ్చారని వెల్లడి
బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే అవకాశం ఉందని, ఈ విషయాన్ని గతంలో కల్వకుంట్ల కవిత చెప్పారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో మైనార్టీలను మభ్యపెట్టడానికి కుట్ర జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు బుధవారం ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలోని మైనారిటీలకు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారని అన్నారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి 3 నెలలైనా స్పందించలేదని విమర్శించారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వలేదని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒప్పందం లేకపోతే ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు.
Revanth Reddy
BRS BJP merger
K Kavitha
Telangana politics
Revanth Reddy comments
KCR

More Telugu News