Nigar Sultana: రూమ్ కి పిలిచి మరీ కొడుతుంది... బంగ్లా మహిళల జట్టు కెప్టెన్ పై తీవ్ర ఆరోపణలు

Nigar Sultana Bangladesh Womens Cricket Captain Accused of Abuse
  • జూనియర్ ప్లేయర్లను కెప్టెన్ శారీరకంగా హింసిస్తోందన్న మాజీ పేసర్
  • జట్టులో వర్గాలు, పక్షపాతం ఉన్నాయని జహనారా ఆలమ్ విమర్శ
  • దుబాయ్ పర్యటనలోనూ జూనియర్లను కొట్టినట్టు ఆరోపణ
బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టులో తీవ్ర వివాదం చోటుచేసుకుంది. జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీపై సీనియర్ మాజీ పేసర్ జహనారా ఆలమ్ సంచలన ఆరోపణలు చేసింది. జూనియర్ ప్లేయర్లను కెప్టెన్ శారీరకంగా హింసిస్తోందని, చితకబాదుతోందని ఆమె ఆరోపించడం కలకలం రేపుతోంది. జట్టులో పక్షపాతం, అనారోగ్యకర వాతావరణం కూడా ఉందని ఆమె విమర్శించింది.

జూనియర్లను రూమ్‌కి పిలిచి మరీ...!

జహనారా ఆలమ్ ఆరోపణల ప్రకారం, కెప్టెన్ నిగర్ సుల్తానా జూనియర్ క్రీడాకారిణులపై తరచూ చేయి చేసుకుంటోంది. "నిగర్ తన జూనియర్లను విపరీతంగా కొడుతుంది. ప్రపంచకప్ సమయంలో కూడా కొందరు ప్లేయర్లు నాతో ఈ విషయం చెప్పి బాధపడ్డారు. అలా చేయవద్దని నేను చాలాసార్లు చెప్పినా ఆమె వినలేదు. దుబాయ్ పర్యటనలో అయితే ఏకంగా తన రూమ్‌కు పిలిపించుకొని మరీ జూనియర్లను కొట్టింది" అని జహనారా ఆరోపించింది.

కేవలం శారీరక దాడి మాత్రమే కాకుండా, జట్టులో తీవ్రమైన పక్షపాతం, అంతర్గత రాజకీయాలు నడుస్తున్నాయని కూడా ఆమె ఆరోపించింది. "ఈ బాధితుల జాబితాలో నేను ఒక్కదాన్నే లేను. దాదాపు అందరూ బాధితులే. 2021 నుంచే నాతో పాటు మరికొందరు సీనియర్లను పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. జట్టులో కొందరికి మాత్రమే ప్రాధాన్యత దక్కుతోంది" అని ఆమె వ్యాఖ్యానించింది.


Nigar Sultana
Bangladesh Women's Cricket
Jahanara Alam
Bangladesh Cricket
Women's Cricket
Cricket Controversy
Team Captain Abuse
Cricket Team Politics
Sports News
Cricket Allegations

More Telugu News