Bandla Ganesh: నిర్మాతగా రీఎంట్రీ... ఇబ్బంది పెట్టవద్దంటూ బండ్ల గణేశ్ పోస్టు

Bandla Ganesh requests not to be disturbed regarding movie production
  • ప్రస్తుతం తాను ఏ సినిమానూ నిర్మించడం లేదన్న బండ్ల గణేశ్
  • తనకు అందరి మద్దతు కావాలని ఆకాంక్ష
  • చిరంజీవి సినిమా నిర్మించేందుకు బండ్ల గణేశ్ ఆసక్తిగా ఉన్నారంటూ ప్రచారం
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ తనను ఇబ్బంది పెట్టవద్దని సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తాను ఏ సినిమానీ నిర్మించడం లేదని, ఎవరితో సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. సినిమా నిర్మిస్తున్నట్లు వార్తలు రాస్తూ తనను ఇబ్బంది పెట్టవద్దని ఆయన కోరారు. తనకు అందరి మద్దతు, ప్రేమ ఉండాలని ఆకాంక్షించారు.

ఇటీవల జరిగిన పలు సినిమా వేడుకలకు బండ్ల గణేశ్ హాజరుకావడంతో, ఆయన నిర్మాతగా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. మెగాస్టార్ చిరంజీవితో సినిమా నిర్మించేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో, తన రీఎంట్రీపై జరుగుతున్న ప్రచారంపై బండ్ల గణేశ్ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు.
Bandla Ganesh
Bandla Ganesh producer
Telugu cinema
Tollywood
Chiranjeevi
Telugu movies

More Telugu News