Nara Devaansh: మ్యాచ్ చూస్తూ నారా దేవాన్ష్ సంబరాలు... వీడియో పంచుకున్న నారా బ్రహ్మణి

Nara Devaansh Celebrates Indias World Cup Win Video Shared by Nara Brahmani
  • ఐసీసీ మహిళల ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు
  • ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన నారా లోకేశ్ కుటుంబం
  • నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో సందడి
  • కుమారుడు దేవాన్ష్ సంబరాల వీడియోను పంచుకున్న బ్రహ్మణి
  • చరిత్రను చూడటం గర్వంగా ఉందంటూ ట్వీట్
  • ఇది జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం అన్న నారా బ్రహ్మణి
భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించడం తెలిపిందే. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఫైనల్‌లో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ అపురూప ఘట్టాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తన కుటుంబంతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు.

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌కు లోకేశ్, ఆయన అర్ధాంగి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ హాజరయ్యారు. స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. భారత జట్టు విజయం ఖాయమవ్వగానే వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ముఖ్యంగా, నారా దేవాన్ష్ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ కనిపించారు.

ఈ సంతోషకరమైన క్షణాలను నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. స్టేడియంలో వాతావరణం అత్యంత ఉత్సాహభరితంగా ఉందని ఆమె అభివర్ణించారు. "చరిత్ర సృష్టించడాన్ని ప్రత్యక్షంగా చూడటం గర్వంగా ఉంది. నా ఆనందాన్ని, లోకేశ్, దేవాన్ష్ ఆనందాన్ని అదుపు చేసుకోలేకపోయాం. జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని అందించిన భారత మహిళల జట్టుకు ధన్యవాదాలు" అని బ్రాహ్మణి తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌కు తన కుమారుడు దేవాన్ష్ సంబరాలు చేసుకుంటున్న వీడియోను కూడా ఆమె జతచేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Nara Devaansh
Nara Lokesh
Nara Brahmani
Indian Women's Cricket Team
ICC Women's World Cup 2025
DY Patil Stadium
Navi Mumbai
Cricket World Cup
Andhra Pradesh Minister

More Telugu News